ఆపదలో ఉన్నవారికి అండగా నల్ల
కాల్వశ్రీరాంపూర్,అక్టోబర్20(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గం కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి చెందిన దిలీప్ గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వగా వారు హాస్పిటల్ బిల్ కట్టలేని పరిస్థితి ఉందని, బిల్ కట్టలేక 3 రోజుల నుండి హాస్పిటల్ లోనే ఉంటున్నారని పలువురు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి కి సమాచారం ఇవ్వగా స్పందించిన నల్ల హాస్పిటల్ లో డాక్టర్స్ తో మాట్లాడి 10,000 రూపాయలు బిల్ కట్టి, అలాగే మిగతా బిల్ డిస్కౌంట్ చేపించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ సందర్బంగా బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న సమయంలో అండగా నిలిచిన నల్ల మనోహర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని పేర్కొన్నారు.