మృతుల కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధు
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 12 (కలం శ్రీ న్యూస్):మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో మోత్కూరి లావణ్య, కోడిపుంజుల ఒదెలు ఇటీవల మరణించగా వారి కుటుంబాలను పరామర్శించిన మంథని నియోజకవర్గ భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్. వారి వెంట జడ్పిటిసి సుమలత శంకర్ లాల్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏగోలపు శంకర్ గౌడ్,ఎక్లాస్ పూర్ సర్పంచ్ చెన్నవేన సదానందం, ఉప సర్పంచ్ బండి మహేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు గువ్వల రాజశేఖర్, నాయకులు మంథని లక్ష్మణ్, రాదండి శంకర్, కార్యకర్తలు ఉన్నారు.