Wednesday, January 15, 2025
Homeతెలంగాణప్రతి కుటుంబానికి అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం

ప్రతి కుటుంబానికి అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం

ప్రతి కుటుంబానికి అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం

జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్  

మంథని అక్టోబర్ 7 (కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన నాగుల సంతోష్ అనే యువకుడు గత ఏడాది విద్యుత్ షాక్ గురై మృతి చెందగా విద్యుత్ శాఖ నుంచి మంజూరైన ఐదు లక్షల చెక్కును మృతుని తల్లి నాగుల లక్ష్మికి ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలకు దీటుగా బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పరిపాలన అందిస్తున్నారని ఆయన అన్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ఎవరైనా చనిపోతే గత ప్రభుత్వాలు కేవలం రెండు లక్షలు మాత్రమే ఇచ్చేవారని, ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఆనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈనాడు ఏ ఒక్క కుటుంబం రోడ్డున పడకూడదని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాద బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!