ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 23( కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ.శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పటల్ సందర్శించి,ఆసుపత్రిలో సీజనల్ వ్యాధుల వల్ల చికిత్స పొందుతున్న పేషంట్ల ఆరోగ్య పరిస్థితులను తెల్సుకుని వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు మున్సిపల్ కౌన్సిలర్ వికే రవి తదితరులు ఉన్నారు.