నేటి, భావితరాలకు ఆదర్శనీయుడు నరేంద్రమోడీ
డాక్టర్ లెక్కల నగేష్
సుల్తానాబాద్, సెప్టెంబర్ 17(కలం శ్రీ న్యూస్):భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 73వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అఖిల గాండ్ల తిలకుల యువజన సంఘం, వెలుగు రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని నిరాశ్రయులకు అన్నదానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ లెక్కల నగేష్ మాట్లాడుతూ నేటి తరానికి, భావితరాలకు ఆదర్శవంతమైన వ్యక్తిగా నరేంద్ర మోడీ నిలుస్తారని, వసుదైక కుటుంబం అని పిలుపునిస్తూ, ప్రపంచ దేశాలలో శాంతి నెలకొల్పుతున్నటువంటి మహా నీయుడు ప్రధాని మోడీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెలుగు స్వచ్ఛంద సంస్థ సభ్యులు, అఖిల గాండ్ల తిలకుల యువజన సంఘం సభ్యులు, మురళీకృష్ణ, కే రమేష్, కృష్ణ, కే జ్యోతి రవీందర్, జక్కం శ్రీధర్, కన్నం చైతన్య, రామాంజనేయ చారి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.