Wednesday, January 15, 2025
Homeతెలంగాణసుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి పట్టణ కమిటీ నియామకం

సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి పట్టణ కమిటీ నియామకం

సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి పట్టణ కమిటీ నియామకం

బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు

సుల్తానాబాద్,సెప్టెంబర్14(కలం శ్రీ న్యూస్):భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా శాఖ పిలుపు మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,   దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆశీష్యులతో సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతనలో సుల్తానాబాద్ నీరుకుళ్ల రోడ్ ఎస్ఆర్ గార్డెన్ లో బిజెపి కార్యకర్తల సమక్షంలో సుల్తానాబాద్ మున్సిపాలిటి బిజెపి పట్టణ కమిటీని నియమించడం జరిగింది. అందులో భాగంగా బిజెపి సుల్తానాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా గజభింకర్ పవన్ కుమార్, ఉపాధ్యక్షులు ఎనగందుల సతీష్, పంతంగి శ్రీకాంత్, మాటూరి లత, కోశాధికారిగా తోర్రికొండ కళ్యాణ్, బిజెపి పట్టణ కార్యదర్శులుగా వల్స సాయికిరణ్, పోచంపల్లి ఈశ్వర్, కూకట్ల రామ్ ప్రసాద్, పట్టణ అధికార ప్రతినిధులుగా భూసారపు శ్రీనివాస్, కామిరెడ్డి శ్రీనివాస్, బిజెపి పట్టణ యువ మోర్చా అధ్యక్షులుగా దరేడ శ్యామ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు కూకట్ల చంద్రకళ, ఓబీసీ మోర్చ అధ్యక్షులు నూనె మహేష్ పటేల్, కిసాన్ మోర్చ అధ్యక్షులుగా కావేటి లచ్చయ్య,తదితరులు నియామకం అయినారు. వీరి నియామకం తక్షణమే అమలులోకి వస్తుంది అని, వీరి పదవి కాలం మూడు సం.రాలు ఉంటుందని బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నియామకం అయిన బిజెపి కమిటీ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు సుల్తానాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు తెలియజేశారు.ఈ సందర్భముగా పెద్దపల్లి అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్ మాట్లాడుతూ… బిజెపిలో బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి బలం అని బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని రాబోయే ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురవేయలని అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారాపు పర్వతాలు మాట్లాడుతూ…తెరాస ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని అవినీతితో ఎమ్మెల్యేలు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఇసుక మాఫియా, మట్టి మాఫియా, దేవాదాయ భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలను పెద్దపల్లి ఎమ్మెల్యే దోచుకుంటూన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం ప్రజలు చెపుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారాపు పర్వతాలు, మండల అధ్యక్షులు వేల్పుల రాజన్న పటేల్, మండల,పట్టణ ఇన్చార్జులు బిజెపి సీనియర్ నాయకులు పాల్సాని సంపత్ రావు, తంగేడ రాజేశ్వర్ రావు, బిజెపి జిల్లా,మండల,పట్టణ నాయకులు, మహిళా కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!