మంథని వాసికి ఘనంగా సన్మానం
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 24( కలం శ్రీ న్యూస్):తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షుణిగా 4 సంవత్సరల పదవీకాలం ముగిసిన సందర్భంగా మంథని వాస్తవ్యుడు అయిన రంగి నగేష్ ను రాష్ట్ర వ్యాప్తసభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయనకు గండపెండెరం తొడిగి సత్కరించారు.బుధవారం హైదరాబాద్ లో సంఘం సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితి గా తెలంగాణ అప్పిలేట్ ట్రిబ్యునల్ గౌరవ శాఖ సభ్యులు శ్రీమతి సీతాలక్ష్మి హాజరై ప్రసంగించారు. ప్రస్తుత జీఎస్టీ చట్టంలో వస్తున్న అనేకమైన మార్పులు చేర్పులపై సభ్యులకు అవగాహన పెంచడంలో తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్ల సంఘం నగేశ్ రంగి అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమావేశాలను ఆమె అభినందించారు.ఈ కార్యక్రమంలో సంఘ సీనియర్ సభ్యులు మరియు ప్రధాన సలహాదారు పీవీ సుబ్బారావు ప్రసంగిస్తూ గత రెండు సంవత్సరాలుగా సంఘం నిర్వహించిన కార్యక్రమాల ఆవశ్యకతను ప్రాధాన్యతను కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి హాజరైన సభ్యుల సమక్షంలో పాలకమండలి సభ్యులు అధ్యక్షుడిగా పదవీకాలం ముగిసిన తమ ప్రియతమ అధ్యక్షుణికి గజమాలలతో సత్కరించి గండపెండేరము అలంకరించారు. పలువురు సంఘ మాజీ అధ్యక్ష కార్యదర్శులు హాజరై ఆధ్యక్షుణి సేవలు కొనియాడారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యుల కు బాధ్యతలు అప్పగించడం జరిగింది.