కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం…?
కరీంనగర్, జులై 27(కలం శ్రీ న్యూస్):జిల్లా లోని లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది. ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్షాలతో ఏ క్షణంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నది. రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు.
గ్రామాలలో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. పరివాహక ప్రాంతంలోకి పశువులు గాని, గొర్రెలు వెళ్లకుండా చూసుకోవాలని, అలాగే చేపలు పట్టేవారు, గొర్రెల కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండాలని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.