Wednesday, January 15, 2025
Homeతెలంగాణమణిపూర్ రాష్ట్ర బిజెపి ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి

మణిపూర్ రాష్ట్ర బిజెపి ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి

మణిపూర్ రాష్ట్ర బిజెపి ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి

ప్రజాసంఘాల డిమాండ్

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్

మంథని, జూన్ 25(కలం శ్రీ న్యూస్ ):మణిపూర్ లో జరిగిన హింసను ఖండిస్తూ మంగళవారం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం,ఎస్ఎఫ్ఐ,మరియు రైతు సంఘాల ఆధ్వర్యంలో మంథనిలో ఫ్ల కార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ మణిపూర్ లో ఆర్ఎస్ఎస్ బిజెపి మతోన్మాద గుండాలు కుకీ తెగలకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు తీసి అత్యాచారం చేసి చంపడం దుర్మార్గమని అన్నారు. గత నాలుగు మాసాలుగా మణిపూర్ లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్న మైతిలి కుకీ తెగల మధ్య మరణకాండ జరుగుతున్న అక్కడి బిజెపి రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేస్తే తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో చలనం లేదని విమర్శించారు. మతోన్మాద ఏజెండాను మణిపూర్ రాష్ట్రంలో అమలు చేయడంలో భాగంగానే రెండు తెగల మధ్య చిచ్చుపెట్టి మణిపూర్ రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చిందని బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు.మతోన్మాద గుండాలు అక్కడ చర్చి లను తగలబెట్టడం కుకీ తెగలను హత్య చేయడం వంటి బీజేపీ మతోన్మాద హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు స్వచ్ఛంద సంస్థలు అన్ని రాజకీయ పార్టీ పక్షాలు ఖండించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పి ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని మణిపూర్ బిజెపి ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోర్రంకెల సురేష్,నాయకులు విరుగురాల ప్రసాద్,సింగారపు గట్టయ్య,శ్రావణ్,భాగ్య,లక్ష్మి, జయ చందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!