బ్రేక్ ఫాస్ట్ విత్ జి.ఎస్.అర్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి.
సుల్తానాబాద్,జూలై05(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం బ్రేక్ ఫాస్ట్ విత్ జి.ఎస్.అర్ కార్యక్రమంలో భాగంగా బుదవారం సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో గ్రామ ప్రజలతో కూర్చొని అల్పాహారం చేస్తూ వారి సమస్యలు, బాధలు అడిగి తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి బీజేపీ పార్టీ కృషి చేస్తుందని, ప్రతిరోజు నియోజకవర్గ పరిధిలో రోజు ఒక్కో గ్రామంలో గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సురేష్ రెడ్డి తెలిపారు.