Friday, November 8, 2024
Homeతెలంగాణదేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ . 

దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ . 

దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ . 

సుల్తానాబాద్,అక్టోబర్10(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో గురువారం కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరి కృష్ణ కుమార్ గౌడ్ హనుమాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పలు దుర్గామాత మండపాలను దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దుర్గ మాత, హనుమాన్ ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో తులతూగాలని ఆశించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్రులు తనను బలపరచాలని అభ్యర్థించారు. పట్టబద్రులు తప్పకుండా తమ యొక్క ఓటు హక్కును ఎన్రోల్మెంట్ చేసుకోవాలని సూచించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మేధావులు ఉద్యోగస్తులు పట్టబద్రులు తనను ఆశీర్వదించాలని కోరారు. ఆయన వెంట గర్రెపల్లిమాజీ సర్పంచ్ పడాల అజయ్ గౌడ్,  పోరండ్ల చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!