ముగిసిన మండల స్థాయి క్రీడా పాఠశాల ఎంపికలు
వెల్గటూర్ రిపోర్టర్/ శ్రీకాంత్ గౌడ్
వెల్గటూర్,జూలై04(కలం శ్రీ న్యూస్):వెల్గటూర్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం రోజున పాఠశాల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు విద్యార్థుల రిజిస్ట్రేషన్ ముగిసింది. ఇందులో ఎండపల్లి మండలం నుండి ప్రాథమిక పాఠశాల గుల్లకోట, ఎండపల్లి, అంబారిపేట, పాఠశాలల విద్యార్థులు ఎంపిక పరీక్షలకు హాజరయ్యారు. మండలం నుండి ప్రాథమిక పాఠశాల వెల్గటూరు విద్యార్థులు, ఎంపిపీఎస్ చెగ్యాం విద్యార్థులు హాజరయ్యారు .ఈ ఎంపికల్లో పది విభాగాలలో పరీక్షలు నిర్వహించారు . ఈ ఎంపికల్లో 10 విభాగాలలో పరీక్షలు నిర్వహించారు. ఎంఈఓ బత్తుల భూమయ్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండపల్లి నుండి 16 మంది విద్యార్థులు, వెల్గటూర్ మండలం నుండి 8 మంది విద్యార్థులు మొత్తం 24 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ఎంఈఓ పేర్కొన్నారు. మండల స్థాయి ఎంపికల్లో భాగంగా విద్యార్థుల ఎత్తు ,బరువు ,ఫ్లెక్సీబిలిటీ, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఫ్లెక్సీబిలిటీ, వర్టికల్ జంప్, షటిల్ రిలే, 800 మీటర్ల పరుగు, మెడిసిన్ బాల్ త్రో లలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 15 జూలై న జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే జిల్లా స్థాయి ఎంపికల్లో వీరు పాల్గొంటారని ఎంఈఓ తెలిపారు. ఈ ఎంపిక పరీక్షలకు వెల్గటూర్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య ఇన్చార్జిగా వ్యవహరించారు. ఈ ఎంపికల్లో పిఈటిలు డి మహేష్ గుల్లకోట పాఠశాల, అశోక్ చెగ్యాం పాఠశాల, పిడి గంగాధర్ టిఎస్ ఎం ఎస్ కుమ్మరి కుంట, , పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కొండల్ రెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యం తదితరులు పాల్గొన్నారు.