గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ప్రారంభం.
జూలపల్లి,జూన్27(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, పెద్దపల్లి జిల్లా గ్రామీణ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి రాంగోపాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్.
ఈ సందర్భంగా జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈజీఎస్ లో 100 రోజులు పని పూర్తి చేసిన 35 మంది మహిళలను గుర్తించి వారికి జ్యూట్ బ్యాగ్ లు కుట్టడంలో శిక్షణ ఇస్తారని అన్నారు. ఈ శిక్షణ సమయంలో ప్రతి ఒక్కరికి రోజుకు 272/- రూపాయలు, వారికి కావలసిన భోజన వసతి ఏర్పాటు చేశారని, ఈ శిక్షణ 13 రోజులపాటు ఉంటుందని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని వారికి స్వయం ఉపాధికి బ్యాంకు ద్వారా లోను సదుపాయం కూడా ఉంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు ఇది మంచి సదవకాశమని రానున్న రోజులలో ఈ మహిళలు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మొగురం రమేష్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ ఏపీడి సత్యనారాయణ, ఎస్బిఐ ఆర్సిటి డైరెక్టర్ సంపత్ కుమార్, ఎంపీడీవో వేణుగోపాల్ రావు, ఏపీఓ సదానందం, ట్రైనింగ్ అధికారులు, మహిళలు పాల్గొన్నారు.