Wednesday, January 15, 2025
Homeతెలంగాణవిద్యా మహోత్సవ విజయ భావుటకు సమిష్టిగా కృషి చేద్దాం

విద్యా మహోత్సవ విజయ భావుటకు సమిష్టిగా కృషి చేద్దాం

విద్యా మహోత్సవ విజయ భావుటకు సమిష్టిగా కృషి చేద్దాం

మంథని విద్యార్థి యువత అధ్యక్షుడు కొండేల మారుతి

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జూన్ 23(కలం శ్రీ న్యూస్):121వ వసంతాల మంథని విద్యా మహోత్సవంతో పాటుగా అపూర్వ విశేష సంచిక ఆవిష్కరణ కార్యక్రమాలను విజయ వంతం చేయాలని మంథని విద్యార్థి యువత అధ్యక్షుడు కొండేల మారుతి పిలుపునిచ్చారు.శుక్రవారం మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్లో పూర్వ విద్యార్థులతో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కొండేల మారుతి మాట్లాడుతూ రానున్న ఈ సమావేశాన్ని అక్టోబర్ రెండవ వారంలో నిర్వహించనున్న సందర్భంగా పూర్వ విద్యార్థులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ పాల్గొనే వారి జాబితా తయారు చేస్తున్నామన్నారు.శతాధిక వసంతాల స్కూల్ చరిత కలిగీన ఈ ప్రక్రియలో ప్రముఖులు అరువంది మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు.ఈ మహోత్సవంలో దేశ విదేశాల నందున్న కొల్లారపు ప్రకాశ్ రావు, రావికంటి శ్రీకాంత్, జి.రమణారెడ్డి, రేగళ్ళ రాధాకృష్ణ ,యెలిశెట్టి మోహన్ లతో పాటు పలువురు తమ పేర్లు నమోదు చేసుకొని తమ సంఘీబావం ప్రకటిఃచారని తెలిపారు.ఈ సమావేశంలో 1964-65 హైస్కూలు విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాటి బుచ్చన్న గౌడ్,రామడుగు మారుతి లు పాల్గొన్నగా రిటైర్డ్ గెజిటెడ్ హెడ్మాష్టర్ మాడిశెట్టి శ్యాంసుదర్, రామడుగు మారుతి, మంత్రపురి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడిపెల్లి అజయ్, కాంగ్రెస్ నాయకులు మాచీడి రవితేజ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు ఇరుగురాల ప్రసాద్, బిజెపి నాయకులు షరీఫోద్దీన్ లు తమవంతు సహయ సహకారాలు ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!