మంథని ఆర్డిఓ కి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 20(కలం శ్రీ న్యూస్ ):మంథని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నాయకులు మాట్లాడుతూ బిసి కులాల వారికి లక్ష ఆర్థిక సహాయము చేసుటకు ఆన్లైన్ ద్వారా నేటితో గడువు ముగియనున్నదని అధికారులు తెలిపినారు. కాని అధికారికంగా మీయొక్క నిర్ణయాలు సమయము తక్కువగా ఉన్నందున దరఖాస్తుదారులు వారియొక్క కులము, ఆదాయ సర్టిఫికేటు తీసుకోవడానికి ఆన్ లైన్లు సమస్యల వలన ధృవీకరణ పత్రములు సరియైన సమయానికి రానందున దరఖాస్తుదారులు మీరిచ్చిన గడువు ప్రకారము దరఖాస్తు చేసుకునులేకపోయినారు, అలాగే బిసి కులాలలో ఉన్న అన్ని కులముల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహయము అందించేవిధముగా ప్రభుత్వము ద్వారా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడ్నాల శ్రీనివాస్, గోటుగారి కిషన్ జి ,ఆయిలి శ్రీనివాస్, ఆజీమ్ ఖాన్ బండారి ప్రసాద్,రామ్ రాజశేఖర్, మంథని సురేష్, నాగుల రాజయ్య, మాచిడి రవితేజ గౌడ్, ఉదరి శంకర్, తమ్మిశెట్టి రమేష్, మంథని శ్రీనివాస్, అక్కపక సదయ్య, పోనుగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.