Wednesday, January 15, 2025
Homeతెలంగాణశ్రీ శృంగేరి శివగంగ శారద మఠాధిపతి మంథని రాక

శ్రీ శృంగేరి శివగంగ శారద మఠాధిపతి మంథని రాక

శ్రీ శృంగేరి శివగంగ శారద మఠాధిపతి మంథని రాక

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూన్ 18(కలం శ్రీ న్యూస్):శ్రీ శృంగేరి శివగంగ శారద మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ పురుషోత్తమ భారతి స్వామి సోమవారం మంథని కి రానున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆయనకు మంథని ప్రజలు స్వాగతం పలకనున్నారు. అనంతరం పట్టణంలో శోభాయాత్ర నిర్వహించిన అనంతరం స్వామి వారిని శ్రీ శిలేశ్వర సిద్దేశ్వర ఆలయం కు చేరుకుంటారు ఆలయంలో వేద పండితులు స్వామివారికి ధూళిపాదపూజ చేస్తారు. అనంతరం స్వామివారు అనుగ్రహ భాష్యం చేసిన అనంతరం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే మంగళవారం రోజున స్వామివారు గోదావరి నదిలో స్నానం ఆచరించిన అనంతరం శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పట్టణంలోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తారు. ఈ కార్యక్రమాలకు మంథని పట్టణంలోని వేద పండితులు బ్రాహ్మణోత్తములు భక్తులు హాజరుకానున్నారు. శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర దేవాలయంలో స్వామివారికి పాదపూజ నిర్వహిస్తారు. అనంతరం భిక్షా వందన కార్యక్రమం జరుగుతుంది తదనంతరం స్వామివారి దర్శనం ఉంటుంది అని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!