పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 16(కలం శ్రీ న్యూస్): శుక్రవారం ఉదయం మంథని మండలం లక్కపూర్ గ్రామానికి చెందిన కెక్కర్ల రవి గౌడ్ కాలు ఫ్రాక్చర్ కాగా, కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామానికి చెందిన మూల శ్రీనివాస్ రెడ్డి , చైతన్యపురి కాలనీకి చెందిన వేగొలపు శంకర్ గౌడ్ అనారోగ్యంతో ఉండగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు.ఇటీవల చనిపోయిన డాక్టర్ అవధానుల శాంత నరహరి, జంగంపల్లి కనకయ్య,మాణిక్యం పాస్టర్, పెంట అశోక్ వారి కుటుంబ సభ్యులని పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలియజేసిన ఏఐసీసీ కార్యదర్శి,మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.