సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది : సుల్తానాబాద్ ఎస్సై విజయందర్
సుల్తానాబాద్,జూన్15(కలం శ్రీ న్యూస్):రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీరుకుల్ల గ్రామంలో సైబర్ క్రైమ్ / ట్రాఫిక్ రూల్స్ / ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ డ్రగ్స్ వలన కలుగు నష్టం లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుల్తానాబాద్ ఎస్ ఐ విజయందర్ హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ…. గ్రామ ప్రజలు విద్యార్థులు , యువతి యువకులు సెల్ ఫోన్లు లాప్టాప్స్ లలో ఇంటర్నెట్ ను విపరీతంగా వినియోగిస్తున్నారని, ఇలా వినియోగించే వారు ఎక్కువగా సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారని, తప్పకుండా వీరందరికీ సైబర్ క్రైమ్ పై అవగాహన ఉండాలని సూచించారు. మీరు, మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు సైబర్ క్రైమ్ బారిన పడకుండా అవగాహన కల్పించాలని తెలియజేశారు. సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా విద్యార్ధినిలు , మహిళలు తమ వివరాలను గోప్యంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. లాటరీ వచ్చిందని, కూపన్స్ వచ్చాయని ఆన్లైన్లో మరేఇతర విధంగా అయినా సైబర్ నేరగాళ్లు ఎల్లవేళలా మోసం చేస్తూ ఉంటారని, ప్రస్తుతం సైబర్ క్రైమ్ నేరగాళ్లు అవలంబిస్తున్న పద్ధతులను విద్యార్థులు తెలుసుకోవాలని కోరారు. సైబర్ నేరగాళ్లు అవసరం లేనటువంటి లింకులు షేర్ చేస్తూ, కుటుంబ సభ్యుల ఫోటోలను పెట్టుకొని డబ్బులు అడుగుతూ, ఓఎల్ఎక్స్ లో వాహనాలు తీసుకుంటామంటూ, కొనుగోలు చేస్తామంటూ ఎన్నో రకాల ఎటువంటి సైబర్ క్రైమ్ లు సైబర్ నేరగాళ్ల ద్వారా నిర్వహించబడతాయని వాటిని అదుపు చేయాలంటే ఒక పోలీసు వ్యవస్థ తోనే సాధ్యపడదని ప్రతి ఒక్కరూ ప్రజలందరూ సైబర్ క్రైమ్ ఫై అవగాహనను కలిగి ఉండాలని అవగాహనా కోసం రాష్ట్ర ప్రభుత్వం,పోలీస్ శాఖా ఇలాంటి అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలియజేశారు. ప్రజలు ఎవరైనా ఎటువంటి సైబర్ నేరానికి గురైన వెంటనే సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి గాని, వెబ్సైట్ www.cybercrime.gov.in కి కాని సంప్రదించినట్లయితే వెంటనే మీరు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు.
ప్రతి ఒక్కరికి చట్టాల గురించి తెలిసి ఉండాలని బాలికల మహిళల రక్షణ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేయడం జరిగిందని తెలిపారు. కష్టపడి చదవాల్సిన వయస్సులో డ్రగ్స్, గంజాయి, ఇతర చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు. కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు.
షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ గురించి తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండి అయిన పిర్యాదు చేసేందుకు ఉపయోగపడే ఈ షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ స్కానింగ్ పోస్టర్స్ ను జిల్లాలో RTC బస్ లలో, బస్ స్టాండ్ లలో, సినిమా హల్ లు, స్కూల్స్, కళాశాలలు,ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో అతికించబడి ఉంటాయని, ఎలాంటి వేధింపుల కైన గురయ్యే మహిళలు షీ టీం కు పిర్యాదు చేయదలచుకునే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, విద్యార్థుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అంతే కాకుండా విద్యార్థులు, మహిళలు అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీస్ అధికారులకు, డయల్-100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు.
అందరికి మోటార్ వెహికల్ యాక్ట్ నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, అలా ట్రాఫిక్ నియమాలను పాటించినప్పుడే అందరూ క్షేమంగా తమ గమ్యాలను చేరుకుంటారని, మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ, త్రిబుల్ రైడింగ్, రాంగ్ సైడ్ వెహికల్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని నడపడం, రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలను నడపడం, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపడం లాంటివి చేయకూడదని, హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాలు నడపాలని మరియు సీట్ బెల్టు ధరించి వాహనం నడపాలని తెలిపారు. జరుగుతున్న ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు అందులో యువత బలవుతున్నారని దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత ప్రమాదాలకు లోనవడం బాధాకరంగా ఉందని తెలిపారు. రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటించినచో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవచ్చని సూచించారు. ప్రమాదాల సంఖ్య తగ్గడానికి ప్రజల్లో చైతన్యం రావాలని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై విజేందర్ గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ ప్రజలు, గ్రామ పోలీస్ అధికారి సురేందర్ రెడ్డి ASI తో పాటుగా పోలీస్ స్సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ లచ్చిరెడ్డి , పోలీస్ కానిస్టేబుల్ అశోక్ లూ పాల్గొన్నారు.