ఎక్లాస్ పూర్ లో ఘనంగా నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమం
సర్పంచ్ చెన్నవేన సదానందం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 15(కలం శ్రీ న్యూస్):తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా గురువారం పల్లెప్రగతి దినోత్సవం సందర్బంగా ఎక్లాస్ పూర్ గ్రామ సర్పంచ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.గ్రామ కార్యదర్శి గ్రామంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చదివి వినిపించారు.అనంతరం పారిశుధ్య కార్మికులను శాలువాతో సత్కరించి పనిలో నైపుణ్యం కనబరిచిన కార్మికులకు గుర్తింపు పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఒ లక్ష్మి,బిఆర్ఎస్ నాయకులు మంథని లక్ష్మణ్, పెండ్రి ప్రభాకర్ రెడ్డి, గువ్వల రాజు, చిలుక సారయ్య,కారోబార్ దండే రాజయ్య,గుడిమల్ల సత్తి,నల్ల ఓదెలు,రవీందర్ రెడ్డి,జెట్టి సమ్మయ్య, జంజర్ల రాజయ్య, ఏఎన్ఎం లు, వివో లు, టీచర్ లు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.