శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం
బాధ్యతలు స్వీకరించిన సీఐ కర్రే జగదీష్
సుల్తానాబాద్ జూన్ 14 (కలం శ్రీ న్యూస్): శాంతి భద్రతల పరిరక్షణ ద్యేయంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానని నూతన సీఐ గా బాధ్యతలు స్వీకరించిన కర్రే జగదీష్ స్పష్టం చేశారు. బుధవారం నూతన సిఐగా పదవి బాధ్యతలను స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు ఏదేని సమస్య వచ్చిన నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని అన్నారు. సుల్తానాబాద్ లో విధులు నిర్వహిస్తున్న సీఐ ఇంద్రసేనారెడ్డి తిమ్మాపూర్ కు బదిలీ కాగా తాండూరు నుండి బదిలీపై సుల్తానాబాద్ కు వచ్చి జగదీష్ బాధ్యతలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎస్సైలు విజయేందర్, వినీత, అశోక్ రెడ్డి, జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ, తదితరులు పాల్గొని స్వాగతం పలికారు.