గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని మే 15(కలం శ్రీ న్యూస్):ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ సర్కార్‌లోనే పల్లె ప్రగతికిబాటలు పడుతున్నాయని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి హమీ పథకం ద్వారా రూ.20లక్షల నిధులతో చేపట్టిన గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ చేసిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్.ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఆనాడు చిన్న గ్రామపంచాయతీలతో పరిపాలన సౌలభ్యం సాధ్యమవుతుందని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక గ్రామపంచాయతీలను ఏర్పాటుచేశారని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రతి గ్రామాన్ని అభివృధ్ది చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతూ అభివృధ్దిపై ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఇప్పటికే పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అనేక గ్రామాలు అభివృధ్ది చెంది ముఖచిత్రాలే మారిపోయాయన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాలని ప్రత్యేక ప్రణాళికలతో పాలన అందిస్తున్నారని ఆయన వివరించారు. ఈనాడు గ్రామస్తాయిలో పరిపాలన సౌలభ్యం కోసం పక్కా భవనాలు నిర్మించి ఇటు ప్రజలకు, అటు ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని ఆయన అన్నారు. గ్రామపంచాయతీ భవనాల నిర్మాణంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృధ్దికి చిరునామాగా బీఆర్‌ఎస్‌ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తారని ఆయన అన్నారు.