పిఏసిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చల్ల నారాయణ రెడ్డి..
మంథని, మే 6(కలం శ్రీ న్యూస్):కాటారం మండలంలోని తమ స్వగ్రామం అయిన ధన్వాడ , శంకరం పల్లి గ్రామాల్లో పిఏసిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం వడ్ల కొనుగోలు కేంద్రాలకు ప్రారంభించిన బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు,కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు పక్షపాతి కనుక, రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కెసిఆర్ అన్నారు.మొన్నటి అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిన రైతులను అధైర్య పడొద్దని, తడిసిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని రైతులకు హామీ ఇచ్చారు.రైతులు ఎవ్వరు అధైర్య పడొద్దు, మన ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రైతులకు అండగా ఉంటారని దైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో ధన్వాడ సర్పంచ్ జంగిలి నరేష్, శంకరం పల్లి అంగజాల అశోక్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ డబ్బేట స్వామి,పిఏసిఎస్ సీఈఓ ఎడ్ల సతీష్,మాజీ సింగల్ విండో చైర్మన్ తులిసేగారి శంకరయ్య, స్వామి,పిఏసిఎస్ డైరెక్టర్ ఐలయ్య,రాజు నాయక్,డోలి అర్జయ్య, నవీన్,బొడ్డు ఆశయ్య, కొండా రాము,కోటపర్తి శ్రీనివాస్, చల్లా బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.