పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోని గ్రామ పాలకవర్గ సభ్యులు…?
వెల్గటూర్, మే 03 (కలం శ్రీ న్యూస్):వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో బస్సు మూల మలుపు తిరిగే ప్రాంతంలో హైమాస్ లైట్ కొన్ని నెలల క్రితం వర్షం కారణంగా వెలగడం లేదు. రాత్రి వేళల్లో బైకులు, ఆటోలు అటు ఇటు రావడం వల్ల అటుగా వెళ్తున్న ప్రయాణికులకు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గ్రామ ప్రజలు పలుమార్లు పాలకవర్గ సభ్యులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పలక వర్గ సభ్యులు స్పందించి మరమత్తులు చేయించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.