హలో హమాలి… ఛలో హైదరాబాద్
మంథని ఏప్రిల్ 27(కలం శ్రీ న్యూస్ ):హమాలి కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈనెల 29 న హైదరాబాదులోని లేబర్ కమిషన్ ఆఫీస్ ముందు ధర్నా జరగనుంది. సిఐటియు ఆధ్వర్యంలో మంథని అంబేడ్కర్ చౌరస్తాలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల వలె వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని 50 కిలోలకు మించిన బరువులు నిషేధించాలని ఐకెపి సొసైటీ హమాలీలకు ప్రభుత్వం బిల్లు చెల్లించాలని భద్రత గుర్తింపు కార్డులు కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ వంటి చట్టబద్ధ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ గోదాంలో పనిచేస్తున్న హమాలీలను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని హమాలీ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని తదితర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29న హైదరాబాదులోని లేబర్ కమిషన్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో మంథని ప్రాంతం నుండి హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ల సందీప్,గొఱ్ఱంకల సురేష్, హమాలీ కార్మికులు రంగు శంకర్, శ్రీను, రాజయ్య, పుల్లయ్య,మండల బాబు, ఆడప నరసయ్య,గుర్రాల సమ్మయ్య,మొగిలి రమేష్, కొమురయ్య,కట్టయ్య,శీను తదితరులు పాల్గొన్నారు.