చలివేంద్రం ప్రారంభించిన బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జి దాసరి ఉష
సుల్తానాబాద్,ఎప్రిల్20(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి ఉష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పట్టణ వాసులకు, ప్రయాణికులకు ఆటో డ్రైవర్లకు సౌకర్యార్థం బీఎస్పి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సుల్తానాబాద్ మూడో వార్డు కౌన్సిలర్ నిషాన్ ఖాతున్ – రఫీక్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, మండల ఉపాధ్యక్షులు కొల్లూరి నర్సయ్య, మండల కార్యదర్శి కేదాసి రమేష్, మండల కోశాధికారి ఆల్లెపు చంద్రశేఖర్,పట్టణ అధ్యక్షులు తోట మధు పటేల్, అషాడపు రాములు, గోలి శ్రీనివాస్, దిడ్డి తిరుమల్ దాస్, తదితరులు పాల్గొన్నారు