అగ్ని ప్రమాదాల నివారణ గురించి పిల్లలకు అవగాహన
మంథని ఏప్రిల్ 19(కలం శ్రీ న్యూస్ ):అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కాకతీయ హైస్కూల్లో బుధవారం ఫైర్ ఆఫీసర్ సదానందం పర్యవేక్షణలో అగ్ని మాపక యంత్రం ద్వారా అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదాన్ని ఎలా నివారించాలి,అదేవిధంగా వంట చేసే సందర్భంలో గ్యాస్ లీక్ అయినప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు, ఆయిల్ ఫైర్ అయినప్పుడు, వివిధ రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే విషయం పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ ఆస్తి నష్టం జరగకుండా,ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం పైన వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డ్రైవర్ ఆపరేటర్ మెనం రమేష్, ఫైర్ మన్ అషీష్, నాగేంద్ర,నాగరాజు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫైర్ సిబ్బందికి పాఠశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి , డైరెక్టర్స్ రవికిరణ్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి పాల్గొని ధన్యవాదాలు తెలిపినారు.
.