భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల, పట్టణ శాఖ అధ్వర్యంలో విస్తృతస్థాయి బిజెపి కార్యకర్తల సమావేశము.
సుల్తానాబాద్,ఎప్రిల్10(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ మున్సిపాలిటీ పట్టణములో స్థానిక నీరుకుల్ల రోడ్డు లోని SR గార్డెన్ లో సుల్తానాబాద్ బిజెపి మాజీ మండల అధ్యక్షులు కొమ్ము తిరుపతి యాదవ్ అధ్యక్షతన సుల్తానాబాద్ బిజెపి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర బిజెపి మాజీ ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భముగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలో ఉన్న బూత్ స్థాయి కార్యకర్తలను బలోపేతం చేయాలని, శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సుల్తానాబాద్ మండలం కేంద్రంలో 45 బూత్ లు, పట్టణములో 17 బూత్ లు ఉన్నాయి మొత్తం 62 ఉన్నాయి. ప్రతి బూత్ లో 22 మంది కార్యకర్తలు ఉంటారు, వీరిని బలోపేతం చేయడం, గ్రామ గ్రామాన బిజెపి సమావేశాలు ఏర్పాటు చేయాలని దాని వల్ల బిజెపి పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. బిజెపి ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మీసా అర్జున్ రావు మాట్లాడుతూ ఒక్క బిజెపి కార్యకర్త వంద మందితో సమానము అని, పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కష్ట పడి పనిచేయాలని, తెలంగాణ ముఖ్యమంత్రి రెండవసారి అధికారంలోకి రావడానికి అనేకమైన వాగ్దానాలు చేసి వాటిని అమలు పరచడంలో వైఫల్యం చెందినాడు. రుణమాఫీ జరగలేదు, డబుల్ బెడ్ రూములు ఇవ్వలేదు, నిరుద్యోగులను వంచనకు గురి చేశాడు, అనేక రంగాలలో అవినీతి చోటు చేసుకున్నది. వేలకోట్ల కుంభకోణంకు పాల్పడుతున్నారు. అన్నారు. ఈ కార్యక్రమములో సుల్తానాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు ఎల్లంకి రాజన్న, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు గడ్డం మహిపాల్ రెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అదికేశవులు, సీనియర్ నాయకులు పిన్నింటీ రాజు, జిల్లా అధికార ప్రతినిధి సౌదరి మహేందర్ యాదవ్, OBC జిల్లా ప్రధాన కార్యదర్శి చాతరాజు రమేష్, మద్దికుంట ఎంపీటీసీ రాజమణి , అలాగే సుల్తానాబాద్ మండల, పట్టణ బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, వివిధ మోర్చ నాయకులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.