మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన కర్రు నాగయ్య
మంథని ఏప్రిల్ 7(కలం శ్రీ న్యూస్ ):తెలుగుదేశం పార్టీ నుంచి మంథని ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలై కాంగ్రెస్‌లో చేరిన కర్రు నాగయ్య ఎట్టకేలకు గులాబీ గూటికి చేరుకున్నారు.కమాన్‌పూర్ మండలంలో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొనగా ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో కర్రు నాగయ్య బిఆర్ ఎస్ పార్టీలో చేరగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలుగుదేశం పార్టీని వీడిన కర్రు నాగయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి తనదైన శైలిలో పార్టీకి సేవలు అందించారు.అయితే కాంగ్రెస్‌లో పార్టీలో రోజురోజుకు పెరిగిపోతున్న వర్గ విభేదాలు, అంతర్గత పోరు,నాయకుల ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలను చూసిన కర్రు నాగయ్య గత కొద్ది మాసాలుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే నియోజకవర్గంలో 40ఏండ్లుగా ఒకే కుటుంబ పాలన, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలతో అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించిన కర్రు నాగయ్య అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఒకే కుటుంబ పాలనపై పోరాటం చేస్తున్న జెడ్పీ చైర్మన్ ఫుట్ట మధూకర్ కు అండగా నిలువాలనే ఆలోచన చేసి ఇటీవల జెడ్పీ చైర్మన్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.ఈ క్రమంలో కమాన్‌పూర్‌లో జరిగిన బీఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో ఆయనకు మంత్రి కొప్పుల ఈశ్వర్ కండువా కప్పి బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వనించారు.ఈ కార్యక్రమం లో భూపాల్ పల్లి జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని రాకేష్, బిఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.