రేపటి నుండి మంథనిలో క్రైస్తవ సభలు
మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్
మంథని, మార్చి 25(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోని సీయోను ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో క్రైస్తవ వార్షిక సభలు ఏర్పాటు చేసినట్లు పాస్టర్లు వల్లూరి ప్రభాకర్, వాసాల జాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుండి 29 వరకు మూడు రోజులపాటు మంథని పట్టణంలోని పవర్ హౌస్ కాలనీ సీయోను ప్రార్ధన మందిరంలో వార్షిక సభలు జరుగుతాయని, దీనికి వాక్యోపదేశకులుగా హైదరాబాదు నుండి శ్యామ్ సుకుమార్, కరీంనగర్ నుండి అగస్టీన్ వస్తున్నారని తెలిపారు. మంథని నియోజకవర్గంలోని పాస్టర్లు, సంఘ పెద్దలు విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.