Thursday, October 31, 2024
Homeతెలంగాణపేద మెడికల్ విద్యార్థిని కి ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్థిక సాయం.

పేద మెడికల్ విద్యార్థిని కి ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్థిక సాయం.

పేద మెడికల్ విద్యార్థిని కి ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్థిక సాయం.

సుల్తానాబాద్, మార్చి 24(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్ కు చెందిన గడ్డం సమ్మయ్య కూతురు గడ్డం చందన ఉన్నత చదువు కోసం నిరుపేద కుటుంబం కావడంతో సమాజ సేవకులు దయార్థ హృదయం గల చాతల శివ,ప్రభాస్ ఫ్యాన్స్ A జోసెఫ్ తంబి. 2500రూపాయల ఆర్థిక సహాయాన్ని చందన తండ్రి గడ్డం సమ్మయ్యకు తన నివాసంలో అందజేసి తన మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి గడ్డం చందన చదువుకు ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. ఆర్థిక సహాయం అందించేవారు నేరుగా వచ్చి సంప్రదించాలని కోరారు.అనంతరం గడ్డం సమ్మయ్య ప్రభాస్ ఫ్యాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మ రాజ్ కుమార్, బొంగోనీ అనిల్ గౌడ్, ఏపీ వెంకటేష్, మల్లేశం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!