Wednesday, January 15, 2025
Homeతెలంగాణజడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చోరువతో అభివృద్ధి

జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చోరువతో అభివృద్ధి

జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చోరువతో అభివృద్ధి

ఎంపీపీ కొండ శంకర్

మంథని మార్చి 15(కలం శ్రీ న్యూస్):-పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ చోరువతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంథని ఎంపీపీ కొండ శంకర్ కొనియాడారు. బుధవారం మంథని మండలంలోని ధర్మారం గ్రామంలో మంథని నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించిన సందర్భంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, సీఎం కేసీఆర్ ల చిత్రపటాలకు మంథని ఎంపీపీ కొండ శంకర్, బీఆర్ఎస్ డివిజన్ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, జిల్లాలోని మంథనిని అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచేందుకు జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చేస్తున్న కృషి అమోఘమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎగోలపు శంకర్ గౌడ్, మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, సీనియర్ నాయకులు తగరం శంకర్ లాల్ స్థానిక సర్పంచ్ రవి, స్థానిక ఎంపీటీసీ తొంబారపు సుజాత తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజయ్య, మాజీ ఎంపీటీసీ అంబీర్ బాపు, లింగయ్య, యువజన అధ్యక్షుడు నరేష్, నాయకులు రాగినేని కుమార్, రైతులు, మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!