కంటి వెలుగు ద్వారా పేదల జీవితాల్లో వెలుగు
కౌన్సిలర్ చింతల సునీత రాజు
సుల్తానాబాద్,మార్చి01,(కలం శ్రీ న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం బడుగు బహీనవర్గాల జీవితాల్లో వెలుగు లాంటిదని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని స్థానిక కౌన్సిలర్ చింతల సునీత రాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని 8వ వార్డు మార్కండేయ కాలనీ లో కంటి వెలుగు శిబిరాన్ని కౌన్సిలర్ చింతల సునీత రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా 8 వ వార్డులోనిఅర్హులను గుర్తించి కంటి అద్దాలతోపాటు మందులు, అవసరమైన వారికి ఆపరేషన్లు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శ్రీజ, హెచ్ ఈ ఓ శ్రీనివాస్ రెడ్డి, షహనాజ్,మానస ఏ ఎన్ మ్ లు సరస్వతి, శారద, కవిత ఆర్పీలు రమ , వార్డు ఆఫీసర్ రమేష్, ఆశ వర్కర్ల తో పాటు పలువురు పాల్గొన్నారు.