Thursday, September 19, 2024
Homeతెలంగాణమంథనిలో అక్రమ నిర్మాణాలపై స్పందించిన కలెక్టర్

మంథనిలో అక్రమ నిర్మాణాలపై స్పందించిన కలెక్టర్

మంథనిలో అక్రమ నిర్మాణాలపై స్పందించిన కలెక్టర్

విచారణ జరుపుతున్న అధికారులు

మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్

మంథని ఫిబ్రవరి 23(కలం శ్రీ న్యూస్):మంథని మున్సిపల్ లోని అక్రమ నిర్మాణాలపై స్పందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ తెలిపారు. అక్రమ నిర్మాణాలపై పరిశీలన జరిపి నివేదికను అందజేయాలని స్థానిక అధికారులకు కలెక్టర్ ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో గల పలు ప్రాంతాల్లో మున్సిపల్ అనుమతి లేకుండా,సెట్ బ్యాక్ పాటించకుండా,పలు మున్సిపాలిటీ స్థలాలను సైతం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు.ఈ విషయమై పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా పలు సామాజిక మాధ్యమాల్లో బహిర్గతం చేసినట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సైతం మంథని అక్రమ నిర్మాణాల గురించి సాక్షాత్తు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ప్రస్తావించారని ఆయన వెల్లడించారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ తో పాటు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ దృష్టికి తీసుకొని పోవడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ అక్రమ నిర్మాణాలపై విచారణకు ఆదేశాలు జారీ చేసి నివేదికను అందించాల్సిందిగా స్థానిక రెవెన్యూశాఖ, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించి నట్టు తెలిసిందన్నారు.

ఈ మేరకు గురువారం ఉదయం మంథని మున్సిపల్ కమిషనర్ యూ.శారద,రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజిరెడ్డి, మున్సిపల్ ఆర్.ఐ. బి.రాజు ఇతర సిబ్బంది స్వయంగా మంథని మున్సిపల్ పరిధిలోని గణపతి దేవాలయం సమీపంలో ఎలాంటి అనుమతి లేకుండా రెడ్డి సంక్షేమ సంఘం పేరిట నిర్మాణం చేసిన రెండు అంతస్థుల భవనంతో పాటు అదే రోడ్డులో ఓ ప్రజా ప్రతినిధి మున్సిపల్ స్థలంలో చేసిన ఓ రేకుల షెడ్, ఆ పక్కనే అనుమతి కన్నా పలు అంతస్థుల నిర్మాణం చేసిన మరొక భవనాన్ని కూడా పరిశీలించారన్నారు.

అదేవిధంగా పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న రాఘవులు నగర్ లో సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం జరుపుతున్న ఓ రెండు అంతస్థుల భవనం,మార్కెట్ ఏరియాలో మరో వ్యాపారి భవనం,గోదావరి ఖని రోడ్డులో గౌడ్స్ ప్లాట్ల వద్ద ఓ కాంట్రాక్టర్ చేసిన భవన నిర్మాణం, అదే రోడ్డులో పాత గోదావరి ఖని క్రాస్ రోడ్డులో మినీ ఫంక్షన్ హాల్ పేరిట చేసిన ఓ రేకుల షెడ్ నిర్మాణం తో పాటు లైన్ గడ్డ ప్రాంతంలో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యాపారి భవనాన్ని నిర్మాణం చేయగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోని అట్టి భవనాన్ని కూడా పరిశీలించి జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది అన్నారు. స్థానిక అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ఏమి చర్యలు తీసుకుంటారో వేసి చూడాలన్నారు.ఈ విషయమై వెంటనే స్పందించిన జిల్లా అధికారులతో పాటు స్థానిక అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఇనుముల సతీష్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!