Friday, November 8, 2024
Homeబిగ్ బ్రేకింగ్రైతు బంధు ఆపిన కాంగ్రెస్ ను బొంద పెట్టండి.

రైతు బంధు ఆపిన కాంగ్రెస్ ను బొంద పెట్టండి.

రైతు బంధు ఆపిన కాంగ్రెస్ ను బొంద పెట్టండి.

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్

సుల్తానాబాద్,నవంబర్27(కలం శ్రీ న్యూస్):రైతు బంధు ను ఆపిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ముందస్తు పెట్టుబడి అందించేందుకు రైతు బంధు పథకం ప్రారంభించారన్నారు. ఇప్పటికే 11 సార్లు రైతుబంధు ఇచ్చారని, కేంద్ర ఎన్నికల సంఘం సైతం రైతుబంధు నిరంతర ప్రక్రియ కాబట్టి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు వేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఓటమి భయంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు బీజేపీ ఢిల్లీ లో కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘం నుండి తిరిగి రైతుబంధును వేయకుండా ఆదేశాలు ఇప్పించారన్నారు. అటువంటి కాంగ్రెస్, బీజేపీ లకు ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి దాసరి మనోహర్ రెడ్డిని గెలిపిస్తే డిసెంబర్ 3 తర్వాత ప్రతి మహిళకు మూడు వేల రూపాయలు అందుతాయన్నారు. 400 రూపాయలకే సీలిండర్ అందిస్తామని, తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా అందిస్తామన్నారు. సన్యాసులకు ఓటు వేస్తే అభివృద్ధి జరగదని,నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మనోహర్ రెడ్డికి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. దాసరిని గెలిపిస్తే నియోజకవర్గంలో కొలనూరు, గర్రెపల్లి, పెద్దపల్లి రూరల్ మండలాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ రోడ్ షోలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి , ఎంపీ వెంకటేష్ నేత లతో పాటు,పౌర సరఫరాల ఛైర్మెన్,జిల్లా ఛైర్మెన్ లు,ఎంపీపీ లు,మున్సిపల్ ఛైర్మెన్,జడ్పీటీసీ లు,సీనియర్ నాయకులు, ఏఎంసి, పి.ఏ.సి.ఎస్ ఛైర్మెన్ లు, వైస్ ఛైర్మెన్ లు, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కౌన్సిలర్ లు,పట్టణాధ్యక్షులు,ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కో ఆప్షన్ లు ,మాజీ ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్ లు,భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!