Saturday, July 27, 2024
Homeబిగ్ బ్రేకింగ్తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడే ఛాన్స్ ఉంది: వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడే ఛాన్స్ ఉంది: వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడే ఛాన్స్ ఉంది: వాతావరణ శాఖ

హైదరాబాద్:నవంబర్ 23(కలం శ్రీ న్యూస్):తెలంగాణలో ఉరుములతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కీలక సమాచారం తెలిపింది.రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల వర్షాలు పడతాయని తెలిపింది.తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు. తెలుపగా ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపారు.

హైదరాబాద్‌ లోనూ వచ్చే 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పగటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోదని,రాత్రి కూడా చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని అన్నారు. ప్రస్తుతానికి నేటి నుంచి ఈనెల 26 వరకు చెదురు మెదురుగా వర్షాలు ఉంటాయని, వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయన్నారు. నేడు శ్రీ సత్యసాయి, చిత్తూరు, కృష్ణా, బాపట్ల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణం శాఖ అధికారులు తెలిపారు…

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!