మంథని నియోజకవర్గంలో దూసుకుపోతున్న బీఎస్పీ పార్టీ
మంథని,నవంబర్21(కలం శ్రీ న్యూస్):అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగిరి మండలం కేకే నగర్ (వెంకట్రావ్ పల్లి ), సుందిల్లా, ముస్త్యాల, సింగిరెడ్డి పల్లి గ్రామాలలో పర్యటించిన బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల నారాయణ రెడ్డి.
ఈ కార్యక్రమాలలో నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూమంథని నియోజకవర్గంలో చాలా మంది ప్రజలు సరైన ఇండ్లు లేక పరదాలు కట్టుకొని వారి జీవనం గడుపుతున్నారని, మీరు ఓట్లు వేసి గెలిపించిన పుట్ట మధు, శ్రీధర్ బాబు మాత్రం విలాసవంతమైన జీవనం గడుపుతున్నారని,మంథని నియోజకవర్గ ప్రజలు, మీరు ఓట్లు వేసి బిక్ష పెడితే వాళ్ళు మాత్రం వేలాది ఎకరాల భూములు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని మళ్ళీ మనల్ని గొర్రెల్లగా మన ఓట్లను కొనుక్కొని మళ్ళీ గెలవాలని డబ్బుల కట్టలతో సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఆ ఇద్దరి దొంగలకు మన ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పాలని,పేదలను నమ్మించి దళిత బంధు, గృహ లక్ష్మి వంటి పథకాలు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు పేదల నుండి వసూళ్లు చేసారని,ఒకప్పుడు ఎద్దు అడుగు భూమి లేని వ్యక్తి కి ఇయ్యాల మట్టి తల్లి పేదింటి బిడ్డను అనీ లక్షల కోట్లు అక్రమంగా సంపాదించి, మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నారని,నాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన వెనువెంటనే పేద ప్రజలు ఇండ్లు, కార్పొరేటర్ స్థాయిలో వైద్య కళాశాలలు, కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను నిర్మించే దిశగా పోరాడుతానని అన్నారు.మంథని నియోజకవర్గంలో నిరుద్యోగంతో వేలాది మంది యువతి, యువకులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదని,నిరుద్యోగ యువతీ, యువకులు మంథని నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ కల్పన రూపొందిచుతానని,మీ అమూల్య ఓట్లను ఏనుగు గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి మీ సేవకుడిగా, మీ కొడుకుగా మంథని నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని నాకు కల్పించాలని కోరారు.
గ్రామాలలో ప్రజలు తండోప తండాలుగా నారాయణ రెడ్డి ని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలిపారు.