Saturday, July 27, 2024
Homeబిగ్ బ్రేకింగ్కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం 

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం 

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం 

న్యూ ఢిల్లీ,సెప్టెంబర్19(కలం శ్రీ న్యూస్):కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. ఇకపై పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.

ఈ స్థానాలు మహిళలకే

చట్టసభల్లో మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలపై చర్చ నెలకొంది. రాష్ట్రంలో 39-40 స్థానాలు నారీమణులకు కేటాయించే అవకాశం ఉంది. అత్యధిక మహిళా జనాభా ఆధారంగా నియోజకవర్గాల కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే నిర్మల్, ముథోల్, పెద్దపల్లి, మంథని, కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, నిజామాబాద్ అర్బన్, రూరల్ స్థానాలు,జహీరాబాద్, కామారెడ్డి, పటాన్ చెరు, గజ్వేల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కార్వాన్, యాకత్ పురా, శేరిలింగంపల్లి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మక్తల్, వనపర్తి, గద్వాల్, హుజూర్ నగర్, దేవరకొండ, తుంగతుర్తి, మునుగోడు, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, పినపాక, ఇల్లందు, మహబూబాబాద్, సత్తుపల్లి, కొత్తగూడెంతో పాటు మరికొన్ని స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!