Monday, November 11, 2024
Homeబిగ్ బ్రేకింగ్దళితులపై వివక్ష చూపుతున్న స్థానిక ఎమ్మేల్యే

దళితులపై వివక్ష చూపుతున్న స్థానిక ఎమ్మేల్యే

అంబేడ్కర్ విజ్ఞాన భవనం ఏమైందీ

ఎస్ ఎం హెచ్ లేక విద్యార్థుల ఇక్కట్లు

పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణ రావు.

పెద్దపల్లి,జనవరి25,(కలం శ్రీ న్యూస్): సీఎం కేసీఆర్, ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి దళితుల పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నారని టిపిసిసి ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విజయరమణా రావు ద్వజమెత్తారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెద్దపల్లి పట్టణ 25,26 వ వార్డులో (ఉదయ్ నగర్) ప్రాంతంలో విజయరమణారావు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయరమణ రావు  మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం దళితుల పట్ల వివక్షను చూపుతున్నదని విమర్శించారు. తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడేనని చెప్పిన కేసీఆర్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ మాటే మరిచారని అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి 8 ఏళ్లయినా ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పెద్దపల్లి పట్టణంలో దళితుల సమస్యలు తీరక చాలామంది సతమతమవుతున్నారని ఆయన అన్నారు. నిరుద్యోగ దళిత యువత యువకులకు విద్యార్థుల కోసం ఐదు కోట్ల రూపాయలతో పెద్దపల్లిలోని రైల్వే స్టేషన్ రోడ్ లో గల గోశాల స్థలంలో చేపట్టిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విజ్ఞాన భవనం కోర్టు స్టేతో నిలిచిన కూడా స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. ఆ స్థలం వివాద స్వద స్థలం అని తెలిసిన కూడా అందులోనే శంకుస్థాపన చేశారని అన్నారు.

మూడేళ్లు గడిచినా కూడా ప్రత్యామ్నాయ స్థలం చూడడం లేదని విమర్శించారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో దళిత విద్యార్థుల కోసం స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో ఉన్నప్పటికీ జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో లేకపోవడంతో ఎస్సీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వసతి లేక అనేకమంది విద్యార్థినిలు మధ్యలోనే ఉన్నత చదువులను నిలిపివేస్తున్నారని అన్నారు. ఈ సమస్య పరిష్కరించాల్సిన స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. దీనిని బట్టి ఆయనకు దళితులపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. అలాగే పట్టణంలో కూడా అనేక సమస్యలు వెంటాడుతున్న కూడా మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం వహిస్తున్నదని అన్నారు. పెద్దపల్లి దళిత స్మశాన వాటికలో నిధులు మంజారు అయిన ఈ పనులను నేటి వరకు కూడా పూర్తి చేయలేదు. కేవలం 10 శాతం నిధులు లేని పనులు మొదలు పెట్టి, ఇంకా 90 శాతం నిధులతో దళిత  శ్మశాన వాటిక లో పూర్తి చేయలేదన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో గుర్తించాలని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దళితుల సమస్యలు పరిష్కారం అవుతాయని విజయ రమణారావు అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!