Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డుపై జారిపడిన కొండరాళ్లు

ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డుపై జారిపడిన కొండరాళ్లు

ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డుపై జారిపడిన కొండరాళ్లు

ఇంద్రకీలాద్రి,జులై26(కలం శ్రీ న్యూస్):విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు బుధవారం జారి ఘాట్‌ రోడ్‌ మీద పడ్డాయి. దీంతో అప్రమత్తమైన దేవస్థానం అధికారులు ఆ మార్గంలో టోల్‌గేట్‌ ను మూసివేశారు.భక్తులను మల్లికార్జున మహామండపం మెట్ల మార్గం వైపు మళ్లించారు. ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది ఘాట్ రోడ్డులో పడిపోయిన రాళ్లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఎవరికీ గాయాలు కాకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!