నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శోభాశంకర్
సుల్తానాబాద్,ఆగస్టు5(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ నూతన మున్సిపల్ కమిషనర్ గా హైదరాబాద్ సిడిఎంఏ మిషన్ డైరెక్టర్ మెప్మా విభాగం నుండి వచ్చిన శోభాశంకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం బాధ్యతలు చేపట్టిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. గతంలో సుల్తానాబాద్ లో కమిషనర్ గా విధులు నిర్వహించిన కట్ల వేణు మాధవ్, కరీంనగర్ కు బదిలీ కాగా హైదరాబాదు నుండి వచ్చిన శోభ శంకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, వైస్ చైర్మన్ బిరుదు సమత కృష్ణ, పాలకవర్గ సభ్యులతో కలిసి మున్సిపల్ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు.