Wednesday, January 15, 2025
Homeతెలంగాణప్రజలందరూ గులాబీ పార్టీ వైపే....పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ప్రజలందరూ గులాబీ పార్టీ వైపే….పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ప్రజలందరూ గులాబీ పార్టీ వైపే….పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి,నవంబర్28(కలం శ్రీ న్యూస్):పొరపాటున ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రైతుబంధు ఆగిపోతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం ఎన్నికల ప్రచార ముగింపు ర్యాలీలో మాట్లాడుతూ రైతుల నోటికాడికి వచ్చిన రైతుబంధు నిధులను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆపివేయించిందన్నారు. ప్రతిపక్షంలో ఉంటేనే ఇలా చేస్తే అధికారం ఇస్తే ఇంకేం చేస్తారో ప్రజలు గమనించాలన్నారు. భారాస కు ఓటు వేస్తే రైతుబంధు 16 వేలకు పెంచుతామన్నారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మూడోసారి భంగపాటేనని,  అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని, ప్రజలు మరోసారి నమ్మి ఓట్లు వేస్తారన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్  ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, పెద్దపల్లి లో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు. వారంటీ లేని పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినా, 60 గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోని తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచంలో ఎక్కడా కూడా కేసీఆర్ అందిస్తున్న పథకాలు లేవన్నారు. రైతుబంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, కెసిఆర్ కిట్టు, జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ అంటివి ఒక్కటి కూడా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపాలని అభ్యర్థించారు.

ఈ రోడ్ షోలో నియోజకవర్గ ఇంచార్జ్ పౌర సరఫరాల ఛైర్మెన్,జిల్లా ఛైర్మెన్ లు,ఎంపీపీ లు,మున్సిపల్ ఛైర్మెన్,జడ్పీటీసీ లు,సీనియర్ నాయకులు, ఏ.ఎం.సి,పి.ఏ.సి.ఎస్ ఛైర్మెన్ లు, వైస్ ఛైర్మెన్ లు, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కౌన్సిలర్ లు,పట్టణాధ్యక్షులు,ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కో ఆప్షన్ లు ,మాజీ ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్ లు,భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!