బీఆర్‌ఎస్ లో చేరిన హెల్పింగ్ హ్యండ్ సభ్యులు
మంథని,నవంబర్10(కలం శ్రీ న్యూస్):ప్రభుత్వంతో పాటు సేవా సంస్థలు సమిష్టిగా సేవ చేయాలని ఆలోచన చేయడం చాలా గొప్ప విషయమని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ అన్నారు.
కమాన్‌పూర్ మండల కేంద్రంలోని హెల్పింగ్ హ్యండ్స్ సంస్థ అధ్యక్షుడు నారగోని సతీష్‌గౌడ్‌తో పాటు 53మంది సభ్యులు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం కమాన్‌పూర్ మండలకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కమాన్‌పూర్‌కు ఒక ప్రత్యేక ఉందని, ఇక్కడి యువకులు చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా గొప్ప ఆలోచనతో పేదలకు సేవ చేయాలని హెల్పింగ్ హ్యండ్స్ సంస్తను స్థాపించడం అభినందనీయమన్నారు. అంతేకాకుండా కమాన్‌పూర్ ప్రజలు సైతం చైతన్యవంతులని తనకు మెజార్టీ ఇస్తూనే ఉన్నారని అన్నారు. అయితే తాను చేస్తున్న సేవలు గుర్తించి తనతోకలిసి సేవలను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో హెల్పింగ్ హ్యండ్స్ సభ్యులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరడం శుభసూచికమన్నారు. ప్రభుత్వంతో కలిసి స్వచ్చంద సేవా సంస్థలు సమిష్టిగా పనిచేయాలని ముందుకు రావాలని, ఇందుకు హెల్పింగ్ హ్యండ్స్ సంస్థను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేదవర్గాల ఆకలి తీర్చడంలో ముందు వరుసలో ఉండాలని, ప్రభుత్వంతో కలిసి సేవ చేస్తే ఇక ఆకలి ఉండదనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. హెల్పింగ్ హ్యండ్స్ సభ్యులు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని, వారి ఆలోచనతో కలిసి తనవంతు సేవ చేస్తామన్నారు. అదే విధంగా రాజకీయ అవకాశం ఇచ్చిన బీసీ బిడ్డ పుట్ట మధును కాపాడుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వెంగల తిరుపతి గౌడ్ మీ వెంటనేనుంటానని బీఆర్‌ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డగా ఈ స్థాయికి ఎదిగితే అనేక అబండాలు, అబద్దాలు కుట్రలు చేస్తున్నారని, ఇన్ని తట్టుకుని ప్రజల కోసం నిలబడ్డానని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందించడంలో స్వచ్చంద సంస్థలు కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.