అభివృద్ధి ప్రదాత…దాసరి మనోహర్ రెడ్డి ని గెలిపించండి
ఎమ్మెల్యే తనయుడు బీఆర్ఎస్ యువనాయకులు దాసరి ప్రశాంత్ రెడ్డి
కాల్వ శ్రీరాంపూర్,అక్టోబర్18(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ని మరోసారి గెలిపించాలని ఎమ్మెల్యే తనయుడు బీఆర్ఎస్ యువనాయకులు దాసరి ప్రశాంత్ రెడ్డి కోరారు. బుధవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని లక్ష్మిపూర్ గ్రామంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించి బీఆర్ఎస్ పార్టీనీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారనీ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే దాసరి మనోహర్ రెడ్డి ని మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి దాసరి మనోహర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి,సర్పంచ్ బండ రవీందర్ రెడ్డి,యూత్ మండల అధ్యక్షులు నూనేటి కుమార్ యాదవ్, ధర్ముల రవి,బండ రాజు, బండ లక్ష్మణ్, బండ యుగేందర్ రెడ్డి, దివాకర్ రెడ్డి,గురియాల దేవేందర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, మల్లేష్, గణపతి రెడ్డి, నర్సింహా రెడ్డి, స్వామి రెడ్డి, బండ.రాజు, పల్నాటి మోహన్ రెడ్డి, లింగారెడ్డి,రాజేందర్ రెడ్డి, మహేష్, రాజు, రాకేష్,సుధాకర్ రెడ్డి, లింగారెడ్డి, భూమ్ రెడ్డి, సదశివా రెడ్డి, జనార్ధన్ రెడ్డి, పాలక వర్గ సభ్యులు,మండల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.