Wednesday, January 15, 2025
Homeతెలంగాణరాష్ట్ర స్థాయి రబ్బీ పోటీలకు ఐపీఎస్ పాఠశాల విద్యార్థులు ఎంపిక         ...

రాష్ట్ర స్థాయి రబ్బీ పోటీలకు ఐపీఎస్ పాఠశాల విద్యార్థులు ఎంపిక           

రాష్ట్ర స్థాయి రబ్బీ పోటీలకు ఐపీఎస్ పాఠశాల విద్యార్థులు ఎంపిక           

సుల్తానాబాద్,అక్టోబర్ 11 (కలం శ్రీ న్యూస్ ): ఆదివారం కరీంనగర్ జిల్లా లొ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జి ఎఫ్) అధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 17 బాల బాలికల రబ్బి పోటీల్లో సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎస్ సాయి ప్రణవి, పి యశస్విని, ఎం ద్రువిత, కె శ్రీకర్, ఏం వరుణ్ సందేశ్, టి అభినయ్ చక్కని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు, వారికి శుభాకాంక్షలు ఇండియన్ పబ్లిక్ పాఠశాల కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపాల్ కృష్ణ ప్రియా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని, అక్టోబర్ 12 నుండి 14 తేదీలలో మహబూబాబాద్ తొర్రూర్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి పెద్దపల్లి జిల్లాకు, ఐపీఎస్ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, ఇక్బాల్, శివ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!