Wednesday, January 15, 2025
Homeతెలంగాణపేదింటి ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ 

పేదింటి ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ 

పేదింటి ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ 

సుల్తానాబాద్, అక్టోబర్ 04(కలం శ్రీ న్యూస్):బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రమంతటా పేదింటి మహిళలకు సీఎం కేసీఆర్  ప్రభుత్వం చీర కానుకలు అందజేస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రె అన్నారు. ఈ మేరకు సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల గ్రామంలో ఎమ్మెల్యే  ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్  ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తున్నార‌ని, గతంలో ఏ ప్రభుత్వాలు కూడా బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ చేయలేద‌ని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ‌తుకమ్మ, దసరా పండుగ కానుకగా ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలను అందజేయడం జరుగుతంద‌న్నారు. ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ చీరలు కానుకగా అందజేస్తున్నారని, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో నియోజకవర్గంలో పండగ వాతావరణం తలపిస్తోందన్నారు. ప్రతి ఒక్కరికీ చీరలు అందేవిధంగా ఏర్పాట్లు చూస్తామన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సమితి జిల్లా అధ్యక్షులు కాసర్ల అనంత రెడ్డి,ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు , మండల పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు, మార్కెట్ ఛైర్మెన్ బుర్ర మౌనిక-శ్రీనివాస్, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ బోయిని రాజమల్లయ్య, పాక్స్ ఛైర్మెన్ మోహన్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత – రమేష్ , సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సుజాత-రమేష్ ,కన్వీనర్ లు శ్రీనివాస్ రెడ్డి, రవి, భూమేష్,మండల యూత్ అధ్యక్షులు గుడుగుల సతీష్,మాజీ ఎంపీపీ పాల రామారావు,అనుబంధ సంఘాల అధ్యక్షులు క్యాదాసి చంద్రమోగిళి ,మార్కెట్ వైస్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి,సర్పంచ్ లు రమేష్, రాజు, ఎంపీటీసీ సంపత్, ఫక్కిర్ యాదవ్, ఉప సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ సంజీవ రెడ్డి,నారాయణ, రైతు సమితి కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి, అనంత రెడ్డి,కృష్ణారావు, గ్రామ శాఖ అధ్యక్షులు భూమేష్,నాయకులు సుగుణాకర్ రావు, చారీ ,డైరెక్టర్ లక్ష్మణ్,మండల  సర్పంచ్ లు, కౌన్సిలర్ లు ,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!