మంత్రి గంగుల కమలాకర్ కి పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ విజ్ఞప్తి
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని, సెప్టెంబర్ 9 (కలం శ్రీ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున విడుదలవారీగా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి ఆన్లైన్ టెక్నికల్ కారణాలతో కులవృత్తులకు ఆర్థిక సాయం అందలేదు.ఈ విషయాన్ని పెద్దపల్లి జడ్పీ చైర్మన్,బీఆర్ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ దృష్టికి వెంకటరావుపల్లి గ్రామస్తులు తీసుకురాగా వెంటనే స్పందించిన పుట్ట మధూకర్ కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ని కలిసి టెక్నికల్ కారణాలతో వెంకట్రావుపల్లి గ్రామానికి కులవృత్తులకు ఆర్థిక సాయం అందలేదని, ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి గంగల కమలాకర్ తప్పకుండా వెంకట్రావుపల్లి గ్రామంలోని కులవృత్తులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.