Wednesday, January 15, 2025
Homeతెలంగాణజెడ్పీ చైర్మన్‌లకు వీఆర్‌ఏల ఆత్మీయ సన్మానం

జెడ్పీ చైర్మన్‌లకు వీఆర్‌ఏల ఆత్మీయ సన్మానం

జెడ్పీ చైర్మన్‌లకు వీఆర్‌ఏల ఆత్మీయ సన్మానం

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,ఆగస్టు 2 (కలం శ్రీ న్యూస్):రెవెన్యూ శాఖలో పని చేస్తున్న వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం,సీఎం కేసీఆర్‌ గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా జెడ్పీ చైర్మన్‌లకు ఆత్మీయ సన్మానం చేశారు.బుధవారం మంథని పట్టణంలోని రాజగృహాలో పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, భూపాలపల్లి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌లను నియోజకవర్గంలోని ఆయా మండలాల వీఆర్‌ఏలు మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.వీఆర్‌ఏలకు పేస్కేల్‌, వారసులకు ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసిన క్రమంలో వీఆర్‌ఏలు ఆనందం వ్యక్తం చేస్తూ జెడ్పీ చైర్మన్‌లను శాలువాలతో సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న తమ కలలకు సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాకారం చేకూర్చిందని,తమ జీవితాలకు వెలుగులు ప్రసాదించారని వీఆర్‌ఏలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మంథని మండల వీఆర్‌ఏలు పంగ శ్రావణ్,తిరుపతి, గట్టయ్య,రంజిత్,సమ్మయ్య, సంతోష్,రాజ్ కుమార్,రాకేష్, రాజేందర్,స్వరూప,రజిత రామగిరి మండల వీఆర్‌ఏలు ఎరుకల సంకీర్తన,భానేష్, శైలజ,శ్రీనివాస్, రమేష్, నరేందర్ ముత్తారం మండల వీఆర్‌ఏలు శివ,రాజ్ కుమార్,రవి సాగర్ కమాన్ పూర్ మండల వీఆర్‌ఏలు కోటేష్,అఫ్జల్,రాజన్న ,ప్రేమ్ సాగర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!