Wednesday, January 15, 2025
Homeతెలంగాణగ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జులై 24(కలం శ్రీ న్యూస్ ):గత 19 రోజులుగా గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మె లో భాగంగా సోమవారం మంథని మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులను కనీసం మనుషులుగా కూడా చూడడం లేదని అనారు. వారి యొక్క న్యాయమే పరమైన డిమాండ్లను గ్రామపంచాయతీ ఉద్యోగులను పర్మినెంట్,చేసి వారికి ఉద్యోగ భద్రత,ఈఎస్ఐ, పిఎఫ్,ఇయ్యాలని అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి జీవో 51 ని సవరించాలని అన్నారు.వారి యొక్క న్యాయపరమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈనెల 27న నిర్వహించే కలెక్టరేట్ ముట్టడిలో జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులందరూ పాల్గొని కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘం జేఏసీ నాయకులతో చర్చలు జరిపి వారి యొక్క న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేనియెడల సమ్మెను ఉద్రిక్తం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎల్పుల సురేష్, పసునుట్టి సంతోష్,ఐలి రవి,గుబ్బల వెంకటేష్,అమ్మకుట్టి శ్రీధర్, జై చందర్,రవి,కొమురయ్య, గ్రామాల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!