ఎక్లాస్ పూర్ లో గొర్రెల మందను ఢీ కొట్టిన కారు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 20 (కలం శ్రీ న్యూస్):మంథని మండలం ఎక్లాస్ పూర్ ప్రధాన రహదారి పై గురువారం రాత్రి గొర్రెల మందను TS 02 EN 4383 నెంబరు గల కారు ఢీ కొట్టింది.మూడు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి.ఎక్లాస్ పూర్ వాస్తవ్యుడు గొర్రె చిన్న రాజయ్య కు సంబంధించిన గొర్రెలు మేతకు వెళ్లి ఇంటికి వెళ్లే సమయంలో ఎక్లాస్పూర్ మెయిన్ రోడ్ లో నెల్లిపల్లి టర్నింగ్ వద్ద సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో గొర్రె చిన్న రాజయ్యకు కాలు విరిగింది. మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు కరీంనగర్ కు తరలించారు. ఎక్లాస్పూర్ గ్రామ ప్రజలు గొర్రె చిన్న రాజయ్యకు నష్టపరిహారం చెల్లించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.కొద్దిసేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు గ్రామస్తులకు కొద్దిసేపు వాగ్వివదం చోటు చేసుకుంది.మంథని సీఐ,ఎస్ఐ లు గ్రామస్తులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసనను విరమించుకున్నారు.