బొడ్రాయి మారుకొలుపు కార్యక్రమంలో పాల్గొని, విరాళాలు అందించినబిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 1( కలం శ్రీ న్యూస్):మహాదేవపూర్ మండలం ఎలకేశ్వరం గ్రామంలో గ్రామ ప్రజల ఆరాధ్య దైవ్యం శ్రీలక్ష్మి-భూలక్ష్మి సమేత బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరై గ్రామ ప్రజలందరితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి,గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో,పాడి పంటలతో ఉండాలని కోరుకుని,విగ్రహ ప్రతిష్టాపనకు విరాళాలు అదించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, మాజీ ఉప సర్పంచ్ బాపు, సమ్మిరెడ్డి, మల్లయ్య, సత్యనారాయణ, నాగవర్ధన్, తిరుపతి, బాపు, రాజయ్య, దేవేందర్,అభిలాష్,మోహన్,బిఆర్ ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.